జగన్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు లోకేష్ జైలుకే

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది ఎన్నికల రాకముందే. ఎన్నికలకు ఇంకా సంసరం ఉండగానే రాష్ట్రంలో రోజురోజుకీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు ని ఆకాశానికెత్తేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్…వచ్చే ఎన్నికలకు చంద్రబాబు చేసిన అవినీతిని అస్త్రంగా మల్చుకుని చంద్రబాబు పై పోరాటం అంటూ ఎన్నికల బరిలో తెగ హడావిడి చేస్తున్నారు పవన్.

ఇక ప్రతిపక్ష నేత జగన్ అయితే రాష్ట్రంలో ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు…ప్రస్తుతం మాత్రం రాష్ట్రంలో వైసీపీ పార్టీ వైపు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి….ఏపీ అంతట ఒక్కటే మాట వచ్చే ఎన్నికలో ఖచ్చితంగా వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం అని…ఇక అసలు విషయానికి వస్తే 2019లో వైఎస్ జగన్ సీఎం అయితే మాత్రం చంద్రబాబు, లోకేష్ లు జైలుపాలవడం ఖాయమని తెలుస్తుంది. అదెలాగంటే నిన్నటి వరకు మిత్రుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన సభలో లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

లోకేష్‌ అవినీతికి పాల్పడుతున్నారని, ఐటీ దాడుల్లో దొరికిపోయిన శేఖర్‌రెడ్డితో ఆయనకు సంబంధాలు ఉన్నాయని బాంబు పేల్చాడు. లోకేశ్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయని, అవసరమైన సమయంలో బయటపెడతానని తెలిపాడు. ఇదే నిజమయితే వైఎస్ జగన్ సీఎం అయితే లోకేష్ అవినీతి ఆధారాలు సేకరించి జైలుకు పంపిస్తాడని సమచారం. అంతేగాక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా జగన్ జైలుకు పంపేస్తాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు…అంతేకాకుండా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ఓటుకు నోటు కేసు ను కూడా బయటకు తీసి లోపలికి పంపించే కార్యక్రమానికి జగన్ ఇప్పటికే ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మాత్రం రాష్ట్రంలో తనకు ఎదురు లేకుండా ముందుకు దూసుకెళ్లడం కాయం. ఈ క్రమంలో గతంలో తనను ఎంతమంది అయితే తన రాజకీయ జీవితాన్ని సమాధి చెయ్యాలనుకున్నారు వారికి సరైన బుద్ధి తగిన రీతిలో జగన్ చెబుతున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here