సాలగ్రామ విశిష్టత ప్రపంచ ప్రసిద్ధి చెందింది

తమిళనాడు చెన్నైలో సాలగ్రామం  ఉంది. ఆ గ్రామం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దేవాలయం లో కొలువై ఉన్న విష్ణువు ను పూజిస్తే సర్వపాపాలన్నీ తొలగిపోతాయన్న నమ్మకం ఉంది. ఈ దేవాలయానికి విష్ణువు ఓ గొప్ప విశిష్టత ఉంది. దేవుడ్ని కొలవాలంటే పెద్ద పెద్ద విగ్రహాల్ని రాళ్లతో తయారు చేసి ప్రతిష్టించి పూజలు చేస్తారు. కానీ విష్ణుభగవానుడు మాత్రం చిన్న చిన్న రాళ్ల రూపాన్ని ధరించి ఆకర్షిస్తున్నాడు. దీని వెనుక పెద్ద కథే ఉంది. కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుడిని పెళ్ళాడుతుంది. ఆమె మహాపతివ్రత. కానీ, జలంధరుడు తన రాక్షస ప్రవృత్తిలో అందరిని పీడిస్తుంటాడు.
అతను ఎంతవరకు వెళ్ళాడంటే, ఒకానొకప్పుడు శివుని రూపంలో వెళ్ళి పార్వతీదేవిని మోసగించబోతాడు. అందుకు కోపగించిన పార్వతీ దేవి విష్ణువును బృంద పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుతుంది. సకల లోకాల క్షేమం కోరి విష్ణుభగవానుడు జలంధరుని రూపాన్ని ధరించి బృందని మోసగిస్తాడు. అనంతరం తన నిజరూపాన్ని ప్రకటిస్తాడు. జరిగిన మోసానికి నివ్వెరపోయిన బృంద విష్ణుమూర్తిని శిలగా మారతావని శపిస్తుంది. అలా శ్రీవిష్ణుభగవానుడు సాలగ్రామ రూపాన్ని ధరించాల్సి వచ్చిందని కథ.
ఇక్కడ సాలగ్రామ శిలలు గండకీనదిలో లభిస్తుంటాయి. మంత్రాలేమి తెలియక పోయినప్పటికీ భక్తి విశ్వాసాలతో సాలగ్రామం పూజను చెస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సర్వపాపహరం చేసేది, సర్వకష్టాలనుంచి రక్షించేది సాలగ్రామం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here