రైళ్లను ఆపుతున్న హనుమాన్ ఆలయం

నడిచే రైళ్లు ఇప్పుడు గాలి వేగంతో పోటీపడుతున్నాయి. అంత స్పీడులో ప్రయాణికులు సురక్షితమే. కానీ ఓ చిన్న గ్రామంలోకి రాగానే రైళ్ల వేగం తగ్గిపోతుంది. రైల్వే అధికారులకు ఈ రహస్యం అంతు చిక్కడం లేదు. ఇందులో వారి ప్రమేయం లేదు. సిగ్నలింగ్ వ్యవస్థతతో సంబంధం లేదు. మరి ఇదంతా ఎలా సాధ్యం.

మధ్య ప్రదేశ్ శాజాపూర్ జిల్లా బోలాయ్ లో విచిత్రం హనుమాన్ ఆలయం వద్దకు రాగానే నెమ్మదిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం కాని రైల్వే అధికారులు సైతం అక్కడి వెళ్లి పట్టాలన్నీ చెక్ చేశారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.  అయితే రైళ్లన్ని ఆంజనేయుడి ఆ దేశాలతో ఆగిపోతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తమను ఆ మారుతీయే కాపాడుతున్నాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 600సంవత్సరాల క్రితమే నిర్మించన దేవాలయం, రైళ్లు ఆగడం వెనుక మరో కథ ఉందని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఓ రైలును డ్రైవర్ అత్యంత వేగంతో నడుపుతున్నాడు.

ఆ హనుమాన్ ఆలయం వద్దకు రాగానే ఎదురెదురుగా రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాలేదు కదా. చిన్నగాయం కూడా కాలేదు. ఇదంతా హనుమంతుడే చేశాడని, ఆయన మహిమలతోనే రైలు ప్రమాదం జరిగినా ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో రైలు డ్రైవర్ కూడా ఆ ప్రాంతాన్ని ఫోటోతీసి హనుమంతుడిని కొలుస్తూ గుడికట్టిచ్చాడనే ప్రచారంలో ఉంది. ఈ గుడికి మరో విశిష్టత కూడా ఉంది. వినాయకుడు, ఆంజనేయుడు కలిపి ఒకే రూపంలో దర్శనం ఇవ్వడం ఈ గుడి ప్రత్యేకత. ఇలా కలిసి ఉండటం చాలా అరుదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here