పెళ్లి విషయం లో కెప్టెన్ కి ఉచిత సలహాలు ఇస్తున్న రోహిత్ శర్మ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి సందర్భంగా  క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు  వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు… ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ  కోహ్లీ అనుష్క శర్మకు సలహాతో చేసిన ట్వీట్ అందర్నీ ఆకర్షించింది ఇంతకి ఆ ట్విట్ “భ‌ర్తగా ఎలా ఉండాలో తెలియజేసే పుస్త‌కాన్ని విరాట్‌కి ఇస్తాన‌ని రోహిత్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

అలాగే అనుష్క శ‌ర్మ‌కి పెళ్లయింది క‌దా అని ఇంటి పేరు మార్చుకోవ‌ద్ద‌ని “ఉచిత స‌ల‌హా కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇప్పటికే స‌వ్య‌సాచి ముఖ‌ర్జీ త‌న ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో అనుష్క శర్మ కోహ్లీ అంటూ ప్రస్తావించడం జరిగింది. అయితే మరొక పక్క కోహ్లీ – అనుష్క ఇద్దరూ ముంబై లో ఒక స్పెషల్ ఫ్లాట్ తీసుకుని అందులో ఉండబోతున్నారు అనే సమాచారం వస్తోంది. అనుష్క కోసం విరాట్ తన డిల్లీ ని ఇంటిని కూడా వదులుకుని ముంబై వచ్చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here