తీవ్ర భావోద్వేగానికి లోనైనా రామ్ గోపాల్ వర్మ

ప్రముఖ హీరోయిన్ శ్రీ దేవి మృతిపట్ల ఆమె వీరాభిమాని సంచలనం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా బాధపడ్డారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా అనేక ట్వీట్లు చేస్తూ ఆమెకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ సినీ రచయిత లక్ష్మీ భూపాల రాసిన శ్రీదేవికి వీడ్కోలు లేఖను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బాల్యం నుంచే శ్రీదేవి చాలా కోల్పోయిందని అందులో ఉంది.
‘నాలుగేళ్ల వయసు నుంచే బాల్యాన్ని కోల్పోయావ్, అమ్మానాన్నలని బిడ్డల్లా పోషించావు..16 ఏళ్ల వయసులోనే కృతిమ వెలుగుజిలుగుల మధ్య సున్నితత్వాన్ని కోల్పోయావ్‌.. నీ కోసం నీవెప్పుడూ బతకలేదనే విషయాన్ని కూడా మర్చిపోయావ్‌.. వచ్చే జన్మలో అయినా నీవు నీ కోసం పుట్టమ్మా’ అంటూ రాసిన ఆ లేఖ అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది.
‘అమ్మా శ్రీదేవి’ అంటూ అతిలోక సుందరిని అందులో సంబోధించారు. ఈ నేపథ్యంలో చాలా మంది అభిమానులు కూడా శ్రీదేవి అంతిమయాత్ర సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో అతిలోక సుందరి శ్రీదేవి ని నిర్జీవంగా చూడలేకపోయారు శ్రీ దేవి అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here