త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని?

నాచురల్ స్టార్ నాని క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది.  సినిమా ఇండస్ట్రీలో వరసగా సినిమాలు చేసె స్తు హిట్లు కొడుతూ తెలుగు సినిమా రంగంలో మినిమం గ్యరెంట్రీ హీరో అనిపించుకున్నడు. ప్రస్తుతం హీరో నాని కృష్ణార్జున యుద్ధం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో  డబుల్ పోజులో నటిస్తున్నాడు నాని. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల అవుతుంది. అయితే ఈ క్రమంలో హీరో నాని టాలీవుడ్ టాప్ దర్శకుడు తో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

‘అత్తారింటికి దారేది’ తరహాలో ఈ కథ ఉంటుందని అంటున్నారు. నాని కూడా అవసరాల శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అందువలన వచ్చే ఏడాదిలో నాని – త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో నాగార్జునతో చేస్తున్న మల్టీస్టారర్ సినిమా ఒకటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here