టీం ఇండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ?

టీం ఇండియా హెడ్ కోచ్ కోసం బీ సి సి ఐ దరఖాస్తులు కోరుతోంది. హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కి ఉన్న ఏడాది పదవీ కలం ముగింపు దశ కి రాబోతోంది సో బీసీసి ఐ వేటని మొదలు పెట్టి మంచి కోచ్ ని తీసుకొచ్చే పనిలో పడింది. ఒకపక్క కమిటీ పెద్దలు అందరూ తమ విశ్వ ప్రయత్నాల్లో మునిగి ఉండగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రీకీ పాన్దింగ్ టీం ఇండియా కోచ్ గురించి తన అభిప్రాయం వెల్లడించాడు. కుంబ్లే స్థానంలో రాహుల్ ద్రవిడ్ ఎంపిక సరైనదని ఆయన చెప్పాడు.

ఈ పదవిని చేపట్టాలనే కోరిక చాలా మందికి ఉంటుందని… కుంబ్లే కి మళ్ళీ ఇవ్వడం కుదిరితే ఇవ్వచ్చు గానీ కుదరకపోతే ద్రవిడ్ ని పెట్టుకోవాలి అన్నాడు పాంటింగ్ . ద్రవిడ్ కంటే గొప్ప వ్యక్తిని బీసీసీఐ ఎంపిక చేయలేదని చెప్పాడు.. మరొక పక్క విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీసీసి ఐ పెద్దలు కూడా ద్రావిడ్ నే ఒక సంవత్సరం పాటు అయినా మంచి కోచ్ గా అవకాసం ఇచ్చి చూద్దాం అన్నట్టు ఉన్నారు అని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here