మహానాడు లో ఆమెకి ఘోర అవమానం .. లేచి వెళ్ళిపోయిన సినీ నటి

ఇవాళ జరుగుతున్న టీడీపీ మహానాడు లో సినీ నటి కవిత అవమానం పాలు అయ్యారు. స్టేజీ మీదకి తనని పిలవలేదు అనీ ఎంతో మంది ప్రముఖుల్ని పిలిచినా తనని పట్టించుకోలేదు అని ఆమె మనస్తాపానికి గురి అయ్యి వెంటనే ప్రాంగణం నుంచి వెళ్ళిపోయారు. టీడీపీ లో తనకి ఎప్పటి నుంచో అవమానాలు జరుగుతూ వస్తున్నా పార్టీ కోసం , చంద్రబాబు సిద్దాంతాల కోసం కష్టపడి పని చేస్తున్నాను అని చెప్పుకొచ్చిన ఆమె ఇలా ఒక మహిళ ని టీడీపీ అవమానించడం బాధగా ఉంది అన్నారు.

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తనను వేదికపై కూర్చోబెట్టారని… అధికారంలోకి వచ్చాక తనను పక్కనపెట్టి అవమానిస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here