ఆ కొండ‌చిలువ మ‌నిషినే మింగేసింది

చాలా అరుదుగా చోటు చేసుకునే ఘ‌ట‌న ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఒక భారీ కొండ‌చిలువ మ‌నిషినే మింగేసింది. త‌న అత్యాశ‌తో మ‌నిషిని మింగేసి అత‌డి మ‌ర‌ణానికి కార‌ణం కావ‌ట‌మే కాదు.. తాను సైతం ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఉదంతంలోకి వెళితే.. ఇండోనేషియాలోని సుల‌వెసి ద్వీపంలో స‌లుబిరో గ్రామంలో వ్య‌వ‌సాయ ప‌నుల కోసం పొలం వ‌ద్ద‌కు వెళ్లాడు అక్బ‌ర్ అనే రైతు. 25 ఏళ్ల ఈ యువ‌రైతు ఎంత‌సేప‌టికి ఇంటికి రాక‌పోవ‌టంతో.. అత‌డి కోసం గాలింపు మొద‌లెట్టారు.
ఒక‌చోట భారీ కొండ‌చిలువ క‌ద‌ల్లేని స్థితిలో ఉండ‌టాన్ని చూశారు. దాని ప‌క్క‌నే ఒక బూటు.. వ్య‌వ‌సాయ ప‌నిముట్టు ప‌డి ఉండ‌టాన్ని చూశారు. సందేహం వ‌చ్చిన వారు..ఆ కొండ‌చిలువను క‌త్తితో చీల్చి చూశారు. కొండ‌చిలువ క‌డుపులో విగ‌త‌జీవిగా ఉన్న రైతును చూశారు. కొండ‌చిలువ అక్బ‌ర్‌ను పూర్తిగా మింగేసింద‌ని.. అత‌డి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు.
ఈ త‌ర‌హా ఘ‌ట‌న జ‌ర‌గ‌టం ఇదే మొద‌టిసారిగా చెబుతున్నారు.
చిన్న చిన్న జంతువుల్ని కొండ‌చిలువ‌ను మింగేయ‌టం చూశాం కానీ.. మ‌నిషిని పూర్తిగా మింగేసిన వైనం మాత్రం ఇప్పుడే చూస్తున్న‌ట్లుగా వారు పేర్కొంటున్నారు. కొండ‌చిలువ‌లు మ‌నుషుల్ని తినేసేందుకు ప్ర‌య‌త్నించ‌టం చాలా అరుదైన ఘ‌ట‌న‌గా చెబుతున్నారు. కొండ‌చిలువ కార‌ణంగా ఆ వ్య‌క్తి కుటుంబం శోకంలో మునిగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here