పవన్ అభిమానులకి అసలు బుద్ధి ఉందా ?

చావు అనేది చాలా పెద్ద విషయం . మన దేశం లో చావుని అసల తేలికగా తీసుకోరు అది చాలా పెద్ద సెంటిమెంటల్ విషయం. చావు అనే పదం ఉచ్చరించడమే పెద్ద అసాధ్యమైన విషయంగా భావిస్తారు చాలా మంది. కానీ ఈ మధ్య కాలం లో ఆ చావు కామెడీ, కాంట్రవర్సీ అయిపోయింది. ఎవరి మీద అయినా కోపం వస్తే చాలు వారికి పిండం పెట్టడం వారు చనిపోయినట్టు ప్రకటించడం , శవ యాత్రలు చెయ్యడం పరిపాటి గా మారింది. నిరసన చెయ్యడం ప్రజాస్వామ్యం కావచ్చు కానీ ఇలా చావు పేరుతో  చేసేది నిరసన అయినా చిరాకు వస్తుంది.

ఈ మధ్యన ట్విట్టర్ యుద్ధం లో రామ్ గోపాల్ వర్మ చనిపోయినట్టు , రెస్ట్ ఇన్ పీస్ అంటూ, శవ పేటిక మోస్తున్నట్టు వీడియోలు ఫోటోలు పెట్టారు పవన్ అభిమానులు. రామూ ఆత్మకి శాంతి చేకూరాలి అంటూ వచ్చిన ఫేక్ వార్తలతో ఎందఱో రామూ కి కాల్ చేసి మరీ ఆయన ఎలా ఉన్నారో కనుకున్నారట. విపరీత పోకడలకి ఇది వింత పరాకాష్ట . పవన్ ఫాన్స్ కి బుద్ది ఉందా అంటూ రామూ ఫాన్స్ తిడుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here