ముఖ్యమంత్రి ని 97 కోట్లు కట్టు .. – గవర్నెర్

ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలలో సుప్రీం కోర్టు తీర్పు కి వ్యతిరేకంగా తన చిత్రాలు వాడుతున్నారు అంటూ దాఖలైన పిటీషన్ ని లెఫ్టినెంట్ గవర్నర్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ చర్య చాలా హేయమైనది అని అంటూ తొంభై ఏడు కోట్ల రూపాయల ఫైన్ కట్టాలి అనీ అది కూడా నెల రోజుల గడువు ఇస్తున్నా అంటూ ఆయన ఆదేశాలు జారీ చేసారు. ఆ డబ్బు మొత్తం నెల రోజుల్లో ఈ డబ్బుని వసూలు చెయ్యమంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుట్టి కి ప్రత్యెక ఆదేశాలు జారీ చేసారు ఆయన.

ఈ ప్రకటనలకి సంబంధించి డబ్బు మొత్తం ప్రజాధన రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసినట్టు ఆయన గుర్తు చేసారు.  అయితే ఈ నోటీసులు ముఖ్యమంత్రి కి ఇంకా అందలేదు అనీ అందిన తరవాత మాట్లాడతాం అంటోంది ఆప్ పార్టీ . 2015 సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పొరపాటున కూడా ప్రభుత్వ పథకాల ప్రకటన చేసేటప్పుడు ప్రధాని, రాష్ట్రపతి , సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్ప ఇంక ఎవరి ఫోటోలు ఉండకూడదు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here