దసరా బరిలో రాబోతున్న నలుగురు పెద్ద హీరోలు ..

సంక్రాంతి సీజన్ ని బాహుబలి తో పాటు కొన్ని సినిమాలు షేర్ చేసుకుంటూ ఉంటె రాబోయే దసరా సీజన్ కోసం స్టార్ లు ప్రణాలికలు రచిస్తూ ఉన్నారు. నలుగురు పెద్ద స్టార్ లు ఈ దసరా ని టార్గెట్ చేస్తున్నారు అని తెలుస్తోంది. బాలయ్య – పూరీ సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ సాగుతోంది. దసరా నాటికి బరిలోకి దిగి తీరాలి అని కసిగా ఉన్నాడు బాలయ్య బాబు. ఈ సినిమాని సెప్టెంబర్ 29 న విడుదల చేస్తాం అని ఇప్పటికే ప్రకటన వచ్చేసింది.

మరొక పక్క ఎన్టీఆర్ కూడా బాబీతో జై లవ కుశ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా లాగిస్తున్నాడు ఇది కూడా దసరా రేస్ లో నిలవబోతోంది. రామ్ చరణ్ సుకుమార్ సినిమా కూడా ఇదే డేట్ కి ఐడియా లో ఉన్నాడు సుక్కూ. ఇవన్నీ కాకుండా మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ పవన్ – త్రివిక్రమ్ లది దసరా బరిలో దింపాలి అని ప్రొడ్యూసర్ లు ఉవ్విళ్ళు ఊరుతున్నారు. మామూలు టైం లోనే పవన్ సినిమాలకి పిచ్చ క్రేజ్ అలాంటిది పండగ టైం అంటే పండగే పండగ సో చూడాలి ఈ దసరా బరిలో ఎందరు హీరోలు రచ్చ చేస్తారో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here