ముగిసిన అనూప్ రుబన్స్ కెరీర్ ?

గుండెజారి గల్లంతయ్యిందే , మనం, ఇష్క్ సినిమాల పాటలూ .. గోపాల గోపాల , కాటమరాయుడు సినిమాల పాటలూ మ్యూజిక్ కొట్టింది ఒక్కరే అంటే నమ్మే పరిస్థితి లేనంతగా అనూప్ రుబెన్స్ మ్యూజిక్ లో తేడా వచ్చేసింది. మొదట చెప్పిన సినిమాలకి ప్రధాన ఆకర్షణ గా ఉన్న మ్యూజిక్ తరవాత సినిమాలకి మైనస్ అయ్యి కూర్చుంది. టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఇవ్వలేని మేలోడీస్ ని మనం , ఇష్క్ లో పెట్టాడు అనూప్ రూబెన్స్ . టెంపర్ తో కూడా పరవాలేదు అని పించిన అనూప్ తరవాత తర్వాత గ్రాఫ్ పడిపోయింది.

లవ్ స్టోరీ లకి ఇచ్చిన మినిమం పాటలు ఇచ్చినా బాగుండేది అంటున్నారు కళ్యాణ్ అభిమానులు. మీరా మీరా మీసం పాట తప్ప ఇంకేమీ ఈ సినిమాలో నిజానికి సెట్ కాలేదు. మాస్ సినిమాలకే కాదు డ్యూయెట్ లకి కూడా అనూప్ పనికిరాదు అంటున్నారు. ఈ కాటమరాయుడు డిజాస్టర్ మ్యూజిక్ తో అనూప్ కెరీర్ ముగిసినట్టే నా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here