వాట్స్ యాప్ గ్రూప్ అడ్మిన్ అరస్ట్ .. కారణం తెలిస్తే మీరు వాట్స్ యాప్ గ్రూప్స్ లో జాయిన్ కూడా అవ్వరు

సోషల్ మీడియా చేతిలోకి వచ్చిన తరవాత మంచి కంటే చెడు ఎక్కువాగా జరుగుతోంది .. ఇష్టం వచ్చినట్టు కావాల్సిన వారిని కించ పరచడం కామెడీ అనే పేరుతో నోటికొచ్చినట్టు మాట్లాడ్డం బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియా గ్రూప్ లలో , వాట్స్ యాప్ గ్రూప్ లో దేవుళ్ళ ని బూతలు తిట్టడం ఇదంతా అలవాటుగా మారింది. ఇలాంటి ఇబ్బంది తో ఇప్పుడు ఒక వ్యక్తి అడ్డంగా ఇరుక్కున్నారు. ఆదిలాబాద్ లో ఒక డిజిటల్ ఫోటో స్టూడియో యజమాని రవీందర్ వాట్స్ యాప్ గ్రూప్ తయారు చేసారు.

దేవుళ్ళని కించ పరుస్తూ ఫోటోలు పెడుతుండడం తో ఫిర్యాదు అందింది. అతడిని పోలీసులు వెంటనే అరస్ట్ చేసారు. ఆ పెట్టిన వ్యక్తి తో పాటు అడ్మిన్ గా ఉన్న రవీందర్ ని కూడా అరస్ట్ చేసారు. ఆ ఫోటో లకి స్పందన తెలుపుతూ అసభ్యంగా మాట్లాడిన వారు ఐన  శ్రీను నాయక్, ఉషశ్రీ, నారాయణలపై కూడా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here