టీడీపీ లోకి విజయశాంతి .. చంద్రబాబు తెలంగాణా లో బ్రహ్మాస్త్రం !

తెలంగాణా పాలిటిక్స్ లో టీడీపీ శకం దాదాపు ముగిసినట్టే అని చెప్పచ్చు. గతం లో నడిచిన ఎన్నికల్లో కానీ ఆ తరవాత వచ్చిన జీ హెచ్ ఎం సి ఎన్నికల్లో టీడీపీ కి చావు దెబ్బ వేసారు తెలంగాణా జనాలు . ఆ పార్టీ ని అక్కడ మళ్ళీ నిలబెట్టే సీన్ ఎవరికైనా ఉందా అని చూస్తున్న చంద్రబాబు కి విజయశాంతి మంచి ఆన్సర్ గా కనపడ్డారు అనిపిస్తోంది.

2019 లో పచ్చ జండా తెలంగాణా ప్రాంతం లో ఎగరాలి అంటే ఉద్యమ కారులని నమ్ముకోవడం కంటే బెటర్ ఆప్షన్ లేదు అని టీటీడీపీ నమ్ముతోంది. అందుకే రాములమ్మ తో ఎంట్రీ ఇప్పించే ఆలోచన చేస్తోంది టీడీపీ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు ఉన్న విజయశాంతి ఓటమి తరవాత పాలిటిక్స్ లోంచి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలకి కూడా రాములమ్మ దూరంగా ఉన్నారు. ఈ మధ్యన తమిళనాడు లో జరిగిన పరిణామాల లో శ‌శిక‌ళ వ‌ర్గానికి రాములమ్మ మ‌ద్ద‌తిచ్చారు.టీడీపీ సీనియర్లు విజయశాంతితో చర్చలు జరుపుతున్నారన్నది పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో వినిపిస్తున్న సమాచారం. ఆమె కూడా ఓకే చెప్పారు అనీ త్వరలో ఎంట్రీ ఉంటుంది అని సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here