బావ చనిపోయినా సినిమా విడుదల ఆపని నాగ్ .. బలమైన కారణం ఉంది :

నాగ చైతన్య కొత్త సినిమా రారండోయ్ వేడుక చూద్దాం మంచి పాజిటివ్ బజ్ తో రాబోతోంది. సరిగ్గా ఈ సినిమాకి విడుదల తేదీ ని చెప్పిన కొన్ని గంటల తరవాత వారి కుటుంబం లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాగార్జున బావ , సుశాంత్ తండ్రి సత్య భూషణరావు చనిపోవడం నాగార్జున కి పెద్ద షాక్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేసారు కూడా. విడుదల తేదీ కూడా ఈ నెలలో ఆపేసి వచ్చే నెల విడుదల చేస్తారు అనే మాట వినపడింది. జూన్ రెండు వరకూ ఆపుతారు అనేది కాన్సెప్ట్ .

బట్ నాగార్జున మాత్రం సినిమాను వాయిదా వేయడానికి ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. యధావిధిగా మే 26న ‘రారండోయ్..’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించుకున్నాడు నాగ్. నాగార్జున ఇంత సీరియస్ నిర్ణయం తీసుకోవడం వెనకాల గట్టి కారణం ఉందట. సమ్మర్ అడ్వాంటేజ్ ని వదులుకోకూడదు అనేది నాగార్జున గేమ్ ప్లాన్ . జూన్ మొదటి వారం లో వేసవి శలవలు పూర్తిగా అయిపోతాయి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళే పనిలో బిజీ ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here