సినిమా లవర్స్ కి జీఎస్టీ గుడ్ న్యూస్ .. నిర్మాతల కి బ్యాడ్ న్యూస్ :

సినిమా లవర్స్ కి ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి .జీ ఎస్ టీ టాక్స్ నుంచి రెండొందల యాభై రూపాయల కంటే తక్కువ ధర కలిగిన టికెట్ల కి పరిధి ని మినహాయించింది ప్రభుత్వం. సినిమా టికెట్ల ధరలు పెరిగే ఛాన్స్ కూడా లేకుండా ఈ బిల్లు చక్కగా మానేజ్ చేసారు. సినిమా హాల్స్ మీద ఇరవై ఎనిమిది శాతం పన్ను విధించారు.

థియేటర్ ల మీద పన్ను ఉంటుంది కాబట్టి టికెట్ ధరలు తగ్గవు. అలాగే పెరగవు .. కూల్ డ్రింక్స్, చిరుతిళ్ల ధరలు పెరుగుతాయి కాబట్టి ఆ రకంగా చూస్తే సినిమా కొంచెం భారంగా మారుతుందనే చెప్పాలి.  సినిమాని విలాస సేవల కింద పడేయడం కాస్త ఆశ్చరంగా ఉంది అంటున్నారు చాలా మంది.ప్రస్తుతం 0 నుంచి 10 శాతం వినోద పన్నును చెల్లిస్తుండగా దానిని 28 శాతానికి పెంచడం ప్రొడ్యూసర్ లకి ఇబ్బందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here