ప్రీతి జింతా షాకింగ్ డెసిషన్..’కింగ్స్ ఎలెవన్’ నచ్చలేదా..?

ఐపిఎల్ సీజన్ ప్రారంభం కానున్న దశలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యజమానురాలు ప్రీతి జింతా షాకింగ్ నిర్ణయం తీసుకోనుంది. తన జట్టు పేరు మార్చాలని ప్రీతిజింతా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడచిన పది ఐపీఎల్ సీజన్ లలో కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ కి  చేరింది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు. ఇప్పటిదాకా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీం ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోలేకపోయింది. ఈ సందర్భంగా ప్రీతిజింతా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనే పేరు కలసి రావడంలేదని, పేరు మార్చలసిందే అని ప్రీతి పట్టుదలగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పటికే తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రీతి బీసీసీఐ కు పంపినట్లు తెలుస్తోంది.సో ప్రీతీ తీసుకున్న ఈ నిర్ణయానికి బీసీసీఐ ఒకే చెబుతుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుత సీజన్ లలో  కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఓనర్ ప్రీతి  మంచి, మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మరి ఈసారి ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ జట్టు టైటిల్ గెలుచుకుంటుందొ లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here