మేడారం జాతర లో జియో సేవలు !

తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. తెలంగాణలో జరిగే సమ్మక్క-సారక్క జాతరకు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు కూడా పాల్గొనేందుకు వస్తుంటారు. అయితే ఈ సందర్భంగా ప్రముఖ టెలికాం సంస్థ జియో  ఈసారి సమ్మక్క సారక్క జాతర కి  వచ్చే భక్తులకు సేవలందించడానికి సిద్ధమైంది.
ఈ జాతరలో జియో భాగస్వామ్యం పట్ల తెలంగాణ జియో సీఈఓ కే సి రెడ్డి ఆనందాన్ని వ్యక్తంచేశారు, అంతేకాకుండా సీఈవో మాట్లాడుతూ డిజిటల్ విప్లవాన్ని గ్రామీణ ప్రజానీకానికి అందించడమే తమ సంస్థ ఉద్దేశమన్నారు. తొలుత జియో ఫీచర్ ఫోన్ ప్రవేశపెట్టడం ద్వారా ఈ దిశగా అడుగులు వేశామన్నారు. అయితే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియో ప్రవేశపెట్టిన రూ.49 ఆఫర్ పట్ల చాలా మంది ఆకర్షితులవుతున్నారని. ఇప్పటికే ఈ ఆఫర్ వల్ల జియో ఫీచర్ ఫోన్ అమ్మకాలు కొంత వృద్ధి చెందాయని.
ఈ ఆఫర్ వినియోగించుకునేందుకు జాతరలో భక్తులకు జియో ఫోన్ అందుబాటులో ఉండేలా వీలయినన్ని స్టాళ్లు ఏర్పాటుచేశామని చెప్పారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 60 లక్షల మంది జియో ఫోన్ వినియోగిస్తూ జియో లైఫ్ ని ఆస్వాదిస్తున్నారని అన్నారు.అయితే ఈ క్రమంలో జాతరకు వచ్చే ప్రతి భక్తులు జియో సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి ఈ డిజిటల్ జియో విప్లవానికి సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మరి జాతర శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here