ఐపీఎల్ వేలంలో అధిక ధర పలికిన ఆటగాళ్లు!

భారత్ లో ఐపిఎల్ సీజన్ షురు అయ్యింది. అయితే ముందుగా ఆయా జట్లు ఆటగాళ్లని కొనుగోలుకు వేలం లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ వేలం ఎంతో ఆసక్తికరంగా జరిగింది. జరుగుతున్న వేలంను ఎంతో మంది ఆసక్తికరంగా తిలకించారు ప్రతి ఒక్కరూ. ఈ సంవత్సరం ఐపిఎల్ జట్లు అత్యధికంగా డబ్బులు చెల్లించి దక్కించుకున్న ఆటగాళ్ల వివారాలు.ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను ఈ ఐపీఎల్ వేలంలో 12.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు దక్కించుకుంది.
తరువాత ఇండియన్ బ్యాట్స్ మెన్ మన్ కె ఎల్ రాహుల్ ను 11 కోట్లకు పంజాబ్ జట్టు దక్కించుకుంది. మరొక భారత బ్యాట్స్ మన్ మనీష్ పాండే ను రాజస్థాన్ జట్టు అదే 11 కోట్లకు చేజిక్కించుకుంది.ఆస్ట్రేలియన్ బాట్స్ మన్ క్రిస్ లిన్ ను 9.6 కోట్లకు కోల్ కతా, ఆస్ట్రేలియన్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను 9.4 కోట్లకు కోల్ కతా, ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ ను 9 కోట్లకు హైద్రాబాద్, ఆస్ట్రేలియన్ బాట్స్ మన్ మాక్స్ వెల్ ను 9 కోట్లకు ఢిల్లీ , ఇండియన్ ఆల్ రౌండర్ క్రునల్ పాండ్య ను 8.8 కోట్లకు ముంబై, భారత బ్యాట్స్ మన్ కం వికెట్ కీపర్ అయినా సంజు శాంసన్ ను 8 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, భారత బాట్స్ మన్ కేదార్ జాదవ్ ను 7.8 కోట్లకు చెన్నై, భారత వికెట్ కీపర్ కం బ్యాట్స్ మన్ దినేష్ కార్తీక్ 7.4 కోట్లకు కోల్ కతా చేజిక్కించుకుంది.అయితే ఇంకా వేలం ఆదివారంతో ముగియనుంది స్టార్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో జరిగే వేలంలో ఎంతమంది అమ్ముడుపోతారో అని క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here