హీరో కూతురు కోసం ప్రభాస్ వెయిటింగ్?

బాహుబలి  వంటి బ్లాక్ బస్టర్  సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం సాహో  సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ప్రభాస్ తో  నటిస్తున్నారు. అయితే ఈసినిమాను ముగిసిన వెంటనే జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్లో హీరో ప్రభాస్ మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమా హీరోయిన్ గా మొదట బాలీవుడ్ భామా దీపిక పదుకొనే అనుకున్నారు  సినిమా యూనిట్.
అయితే ఆమె సినిమా చేయమంటే చేతులెత్తేసింది, మొదట కలిసినప్పుడు పద్మావతి సినిమా విడుదల కాకముందే ఆలోచిస్తానని చెప్పిన దీపిక తర్వాత చేయను అంది.కాబట్టి మళ్ళీ వేట ప్రారంభించారు. ఈసారి బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ను అడిగారట.ప్రభాస్ పేరు వినగానే చాలా ఆనందంగా స్క్రిప్ట్ వినడానికి రెడీ అయింది అంట సారా. స్క్రిప్ట్ బావుంది కానీ వల్ల అమ్మ సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృత సింగ్  అనుమతి తిసుకొని ఏ విషయం చెప్తానని చెప్తోంది. ఆమె కోసం ప్రభాస్ కూడా ఎదురు చూస్తున్నాడు. అంత అనుకున్నట్టు జరిగితే సారా అతి త్వరలో ప్రభాస్ సరసన మన ముందుకు రావచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here