చిరు.. సీక్రెట్ రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి చిరంజీవి మీద సంచలన కరమైన వ్యాఖ్యలు చేసారూ.ఇటీవల చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన దృష్టి మొత్తం సినిమాలమీదే ఉన్నాయని చాలామంది చిరంజీవి సన్నిహితులు చెప్పడం జరిగింది.అయితే కొన్ని సందర్భాల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఎందుకు లేరు అని ప్రశ్నిస్తే?  పార్టీకి సంబంధించిన వారు చిరంజీవి అధిష్టానం పరిమిషన్ తీసుకొని 150వ సినిమా చేస్తున్నారని చెప్పారు ఆయన బిజీగా ఉండటం వల్లే క్రియాశీలకంగా పాల్గొనడం లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
తాజాగా చిరంజీవి మీద బాంబు పేల్చారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆయన ఏమన్నారంటే రెండురోజుల కిందట చిరంజీవి రాహుల్ గాంధీని కలిసి అధ్యక్షునిగా ఎన్నికైన  శుభాకాంక్షలు కూడా తెలిపాడు అని బాంబు పేల్చాడు. చిరంజీవి అంత రహస్యంగా రాహుల్ గాంధీ ని కలవడం ప్రస్తుత రాజకీయాలలో పెద్ద చర్చలకు దారి తీస్తుంది. అయితే ఈ క్రమంలో కొందరు రాజకీయ విశ్లేషకులు ఏమి అంటునరుంటే త్వరలో కర్ణాటక లో జరుగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోరాడవలసి ఉంది. అయితే ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో చిరంజీవికి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడో రాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here