టీజర్ టాక్: ధర్మాబాయ్ డాట్ కామ్!!

మెగా కాంపౌండ్ హీరో, సాయి ధరం తేజ్ హీరోగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఇంటిలిజెంట్ సినిమా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా టీజర్ రిలీజ్ చేశారు ఇటీవల. విడుదలైన టీజర్ బట్టి ఈ సినిమా పక్కా మాస్ సినిమా అని అర్థమవుతుంది. ఈ సినిమాలు హీరో సాయి ధరమ్ తేజ్ డాన్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే డబ్బుల కోసం మర్డర్లు చేసే డాన్ కాకుండా జనాల కోసం నిలబడే ఒక డాన్ అనమాట.
ఒకరకంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాను వి.వి.వినాయక్ గత సినిమాలు కంటే వైవిధ్యంగా తెరకెక్కించాడని చెప్పుకోవాలి. సినిమా టీజర్ బట్టి ఒక చదువుకున్న కుర్రాడు ఇంటిలిజెంట్ డాన్ అయితే ఎలా ఉంటుంది అనేది సినిమా కథ అయ్యుండొచ్చు.  ఈ క్రమంలో ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అద్భుతంగా ఇచ్చాడు.ఈ క్రమంలో సాయి ధరంతేజ్ పక్కన హీరోయిన్ గా లావణ్య త్రిపాటి నటించింది.
ఈ సినిమాను ఫిబ్రవరి 8న రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసేశారు. గతంలో సాయి ధరంతేజ్ మాస్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రావడం జరిగింది అవన్నీ అచ్చిరాలేదు. మరి మళ్ళీ అదే పంథా లో వెళ్తున్నాడు కాబట్టి.. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here