ఈ సమ్మర్ మరింత వేడిగా

ఈ సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏటువంటి పోటీ వాతావరణం లేదు  రెండు తెలుగు అగ్ర హీరోల సినిమాలు వచ్చిన అవి పెద్దగా పోటీ వాతావరణాన్ని సృష్టించలేదు. అయితే వచ్చే వేసవి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హీట్ టెంపరేచర్ పెరుగుతుందట. రాబోయే వేసవి సీజన్ లో టాలీవుడ్ చెందిన ముగ్గురి టాప్ హీరోలు బరిలోకి దిగుతున్నారు. ముగ్గురు హీరోలు కూడా తమ కెరీర్లో ఎప్పుడూ నటించని డిఫరెంట్ క్యారెక్టర్లతో మన ముందుకు వస్తున్నరు.
ఆ ముగ్గురు హీరోలు మరెవరో కాదు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరన్. మహేష్ సీఎం అయితే అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్. ఇక వారికంటే కొంచెం డిఫెరెంట్ గా రామ్ చరణ్  పల్లెటూరి యువకుడి లా కనిపించబోతున్నాడు. అయితే వీరిలో ముందుగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరన్ చెవిటివాడు గా నటించిన రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇక ఆ తరువాత భరత్ వర్సెస్ సూర్య వార్ కొనసాగనుంది.
మహేష్ సినిమా అయితే పూర్తిస్థాయి రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి గా నటిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమా విషయానికి వస్తే యాంగ్రీ యంగ్ ఆర్మీ ఆఫీసర్ గా నాపేరు సూర్య నాఇల్లు ఇండియా తో మన ముందుకు వస్తున్నాడు.దీంతో రాబోయే వేసవి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత వేడెక్కించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here