ఆ దర్సకుడి ని నరికితే యాభై లక్షలు

ఎన్నో వివాదాలూ, దాడులను, ఆందోళనలను, హెచ్చరికలను ఎదుర్కొని విడుదలయ్యింది సంజయ్ లీలా దర్శకత్వం వహించిన ‘పద్మావతి’ సినిమా. దేశంలో ఈ సినిమా మీద జరిగినంత దాడి మరే సినిమా మీద జరగలేదని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో సినిమా విడుదలైన కానీ దాడులు ఆందోళనలు ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఆందోళనలు హిందూ సంఘాల దాడులు భయానకంగా ఉన్నాయి.
అంతేకాకుండా క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ దీపికా పదుకొనేపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమె ముక్కు చెవులు కోసేస్తే కమ్యూనిటీ తరపున కోటి రూపాయల వరకు నజరానా ఇస్తామని చెప్పారు. మరియు అదే విధంగా  క్షత్రియ రాజ్‌పుత్‌ మహాసభ ఉపాధ్యక్షుడు దివాకర్ సింగ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తల నరికి తీసుకువస్తే 51 లక్షలు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా మీద జరిగే దాడిని ఖండిస్తూన్నారు బాలీవుడ్ వర్గాలు. క్షత్రియ మహాసభ సభ్యులు చేసిన వ్యాఖ్యలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here