ఇంజనీర్ అవ్వాలంటే వేదాలు చదవాలి

దేశం మొత్తంమీద ఇంజనీరింగ్ చదువు ముగించుకొని ఇంజనీరింగ్ పట్టా పట్టుకుని బయటకు వస్తున్న విద్యార్థుల్లో చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ పరిణామంతో దేశంలో నిరుద్యోగం ఎక్కువవుతుంది.దీనికి గల కారణం ఇంజనీరింగ్ విద్య నాణ్యత ప్రమాణాల్లో లోపం వ్యక్తమవుతుందనేది ఒప్పుకోవాల్సిన విషయమని అంటున్నారు. దీంతో  అల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికెల్ ఎడ్యుకేషన్ (ఏఐసిటిఈ) ఈ మేరకు కొత్త పాఠ్యాంశ ప్రణాళిక విడుదల చేసింది. దేశ సాంప్రదాయాల విద్యను ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశపెట్టడానికి ఏఐసిటి ఈ కొత్త ప్రణాళికలు వేసింది.
అయితే ఈ క్రమంలో భారతీయ తత్వ భాష, కళాత్మక సంప్రదాయలు, యోగ, ఆధునిక శాస్త్రీయ దృక్పధం పై అవగాహన పెంపొందించేందుకు పాఠ్య ప్రణాళికను పునరుద్దరించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలియచేసారు. ఈ పరిణామంతో విద్యార్థుల ఆలోచనా విధానం మారుతుందని కేంద్ర పెద్దలు అన్నారు. ఆలోచన విధానం, తర్కం, వేదాల్లోని ప్రాధమిక సూత్రాలను విద్యార్థులకు అందచేయడమే ఆ పాఠ్యాంశాలను పొందుపరిచే లక్ష్యమన్నారు.
అయితే ఈ క్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాలు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పాఠ్య ప్రణాళిక పై మండిపడింది. ప్రపంచమంతా సాంకేతిక పరిజ్ఞానం మీద నడుస్తుంటే పురాణాల్లో జ్ఞానం ప్రవేశ పెట్టడం సరైనది కాదన్నారు….అంతేకాకుండా ఇది బిజెపి భావజాలాన్ని దేశ విద్యార్థుల మీద రుద్దడమే అని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here