నయనతార మనహీరో లని అవమానించిందా

దక్షిణాది చలనచిత్ర రంగంలో అన్ని ఇండస్ట్రీల్లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ నయనతార. కానీ నయనతారకు ఎక్కువ పేరు తెచ్చిన సినిమాలు మాత్రం తెలుగులో అని చెప్పవచ్చు. దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోల అందరితో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన జవాబును బట్టి నయనతారకు టాలీవుడ్  హీరోలు మీద చిన్నచూపు ఉందని అనిపిస్తుంది.

కోలీవుడ్ లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నయనతారకి మీకు ఏ స్టార్ హీరోస్ అంటే ఇష్టమనే ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్నకి బదులుగా తనకి కోలీవుడ్ హీరోస్ విజయ్ అన్నా, అలాగే అజిత్ అన్నా చాలా ఇష్టమని చెప్పి టాలీవుడ్ హీరోస్ ని హార్ట్ చేసింది. ఈ జవాబుతో కోలీవుడ్ నయనతార అభిమానులు ఆనందంగా ఉన్న. టాలీవుడ్ అభిమానులు చాలా బాధపడటం జరిగింది. ఎందుకంటే నయనతారకు స్టార్ డం వచ్చింది మాత్రం ఎక్కువగా తెలుగులోనే. దీంతో తెలుగు అభిమానులు తెలుగు స్టార్ హీరోలను చులకన చేసిందనే భావన మాత్రం ఈ ఇంటర్వ్యూ లో నయన మాటలబట్టి అర్ధమవుతుందని కొట్టేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here