అనసూయ కి ఒళ్ళు మండింది

తెలుగు కామెడీ షో జబర్దస్త్  హాట్ యాంకర్ గా తెలుగు వారి గుండెలలో పేరు సంపాదించుకున్న అనసూయ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం జీవితం మీద దాడి చేస్తున్నారని నాక్కూడా ఈ దేశంలో స్వేచ్ఛ ఉందని నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేల కష్టపడుతున్నాం అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కామెంట్స్ పెట్టింది. ఇంతకీ యాంకర్ అనసూయ ఏమన్నారంటే…డియర్ ఇండియా ఓ కూతురిగా, ఓ సోదరిగా, ఓ మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా .. మిగతా అందరిలా నా కుటుంబం కోసం నా బాధ్యతలను నేను నిర్వహిస్తున్నాను.

నేను చేసే పని, ధరించే దుస్తులు నా కుటుంబాన్ని, నన్ను ఏవిదంగా ఇబ్బంది పెట్టడం లేదు. కానీ ఇతరులు మాత్రం స్పందిస్తునారు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని కొందరు నన్నే కాదు నా భర్త, పిల్లలను, తల్లిదండ్రులను , కుటుంబాన్ని దూషిస్తున్నారు. అగౌరవంగా, అమర్యాదగా వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతి రోజు నాకు వచ్చే ఫోన్ కాల్స్, కామెంట్స్ తో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.

ఇది తప్పని తెలుసుకునే శక్తి కూడా మీకు లేదు, ఓ బాధ్యతగల మహిళగా రిపబ్లిక్ రోజున ప్రశ్నిస్తున్నాను స్వేచ్ఛకు అర్థం ఇదా? ఆయన గట్టిగా ప్రతిస్పందిస్తూ ప్రశ్న వేసింది. అయితే గత కొన్నాళ్లుగా చూసుకుంటే అనసూయను సోషల్ మీడియాలో తన ప్రవేట్ లైఫ్ గురించి డ్రెస్ సెన్స్ గురించి తెగ ఆడేసుకుంటున్నారు దీంతో అనసూయ ఒళ్లు మండి సందర్భానుసారంగా రిపబ్లిక్ డే రోజు అందరినీ కడిగేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here