ప్రామిస్… రాజుకి ఎన్టీఆర్-త్రివిక్రమ్ నైజామ్ రైట్స్!

ఈ సంక్రాంతి సీజన్ కి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరికి భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి సినిమా భయంకరమైన ఫ్లాప్ అయ్యింది. అయితే కొందరు సినిమా విడుదల అవ్వకముందు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కదా అని భారీ డబ్బులు చెల్లించి సినిమా కొనడం జరిగింది. సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మీద నమ్మకంతో అజ్ఞాతవాసి సినిమాని 29 కోట్లకు నైజామ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొన్నారు.
అయితే సినిమా విడుదలయ్యాక లెక్కలు చూసుకొంటే దాదాపు 65% లాస్ వచ్చింది దిల్ రాజు కి. ఈ పరిణామంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు అందరు కలిసి  పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళితే ఎలాంటి లాభం జరగలేదు. నిర్మాతతోనే మాట్లాడుకోండి నేనేమీ చేయలేనని చెప్పేశారట. అటు తిరిగి ఇటు తిరిగి పంచాయితీ నిర్మాత చినబాబు చెంతకు వచ్చింది. మిగతా డిస్ట్రిబ్యూటర్స్ సంగతి పక్కన పెడితే దిల్ రాజుకు మాత్రం ఆయన దగ్గర నుంచి అభయం వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్.
ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాను నైజామ్ రైట్స్ మీకు తప్ప ఎవరికీ ఇవ్వననీ, అప్పుడు లెక్కలు చూసుకుందామనీ దిల్ రాజుకి చినబాబు ప్రామిస్ చేశారని సమాచారమ్. అంతేకాకుండా  అజ్ఞాతవాసి సినిమా నష్టాల్లో కూడా కొంత భరిస్తాను అని త్వరలోనే ఈ మ్యాటర్ సెటిల్ చేసుకుందామని చెప్పారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here