‘సైరా’ స్క్రిప్టులో మార్పులు??

చాలా గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ 150 సినిమా తో బాక్సాఫీస్ దగ్గర తానేంటో మళ్లీ నిరూపించుకున్న మెగాస్టార్ చిరంజీవి. తన తర్వాత సినిమా 151 చిత్రం సైరా నరసింహారెడ్డి సురేందర్రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాను హీరో రామ్ చరన్ నిర్మిస్తున్నారని మనకందరికీ తెలుసు. భారీ చిత్ర తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా  షూటింగ్ అర్ధంతరంగా ఆగిపోయింది. గతంలో పదిరోజుల పాటు ఏకధాటిగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తర్వాత ఆగిపోవడం జరిగింది.

అయితే ఈ క్రమంలో సినిమా ని ప్రకకు పెటేశారు అని గుసగుసలు వినిపించాయి. అయితే సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడానికి గల కారణం ఏమిటంటే. సైరా స్క్రిప్టులో మార్పులు జ‌రుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా డైలాగ్స్ విష‌యంలో చిరంజీవి చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. ఈ సినిమాకు బుర్రా సాయిమాధ‌వ్ ర‌చ‌యిత‌. ఇప్ప‌టికే ఆయ‌న దాదాపుగా డైలాగుల‌న్నీ రాసేశారు. అయితే చిరంజీవి మరొకసారి డైలాగులు ఫైనలైజ్ చేసి రెడీ చేయమని చెప్పారట. దీంతో రచయిత డైలాగుల విషయంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ పడుతున్నారట.

గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కి బుర్రా సాయిమాధ‌వ్ రాసిన డైలాగులు చిరంజీవికి బాగా నచ్చాయని, ఆ స్థాయిలో డైలాగులు రాయాలని చిరంజీవి సూచించారట రచయితకి. అయితే గతంలో జరిగిన పది రోజుల షూటింగ్ సన్నివేశాలు కూడా ప‌క్కన పెట్టి మ‌ళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పటివరకు సైరా సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలవలేదని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here