“ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ సినిమాలో మ‌రో హీరో కూడా..?!”

బహుబలి వంటి భారి హిట్ సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి చేయబోయే సినిమా మీద దేశం మొత్తం మీద ఆసక్తి నెలకొంది. అయితే ఈ క్రమంలో రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా సినిమా తీస్తున్నారని వార్తలు రావడంతో అంచనాలు అమాంతం ఆకాశాన్ని అందుకున్నయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎక్కడా కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు.  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమాకి సంబంధించి స్టోరీ కూడా రెడీ కాలేదట.
ప్రస్తుతం ఈ భారీ మల్టీస్టారర్ సినిమా కి విజయేంద్ర ప్రసాద్ కథ సమకూరుస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు విజయేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్‌ల క్యారెక్ట‌రైజేష‌న్లు సిద్ధం చేశారట. వీరిద్దరి క్యారెక్టరైజేషన్ పరిగణలోకి తీసుకుని విజయేంద్రప్రసాద్ ఇప్పుడు స్టొరీ రాయడం మొదలు పెట్టారట. అయితే ఈ క్రమంలో విలన్ పాత్రలు ఓ ప్రముఖ హీరో ని తీసుకోవాలని భావిస్తున్నారట దర్శకుడు రాజమౌళి.అంటే ఈ సినిమాలో హీరోలు ఇద్ద‌రు కాదు… ముగ్గురు. అయితే ఆ మూడో హీరో ఎవ‌ర‌న్న‌ది రాజ‌మౌళి నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here