బాలయ్య హిందూపురం స్థానంపై జనసేన కన్ను!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నరు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అక్కడున్న కరువు పరిస్థితుల గురించి ఆ ప్రాంత రైతులతో సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. తన పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా  హిందూపురం బాలకృష్ణ నియోజకవర్గం పై కన్నేశారని తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అభిమానులు బాగానే ఉన్నారు. హిందూపురం నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి పెట్టింది పేరు.

ఈ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఎన్ని సార్లు జరిగిన తెలుగుదేశం పార్టీ తన విజయపతాకాన్ని ఎగురవేసింది. గతంలో చాలాసార్లు కాంగ్రెస్ ఎన్నికలలో ఇక్కడ విజయాన్ని అందుకోవాలని ప్రయత్నించినా ఓటర్లు టీడీపీ వైపే మొగ్గు చూపారు. అలాంటిది పవన్ అక్కడ ఏ విధంగా తన పార్టీని బలోపేతం చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ క్రమంలో  పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాల నుండే ఎమ్మెల్యే పదవికి పోటీ చేయనున్నాడట. అనంతపురం జిల్లాలో యువత ఎక్కువగా పవన్ వైపు చూస్తోంది.అయితే  పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే ఆసక్తి రాజకీయాలలో నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here