మెట్రో స్టేషన్లు, బోగీల్లో ఏయే పనులు చేయాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి?

మెట్లు, ఎస్కలేటర్లపై జాగ్రత్తగా వెళ్లాలి
ఎస్కలేటర్ పై ఎడమ వైపు మాత్రమే నిలబడాలి
ఎస్కలేటర్ దిగిన వెంటనే దానికి దూరంగా వెళ్లాలి
ఏదైనా సహాయం కావాలనుకుంటే కస్టమర్ సర్వీస్ లేదా స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి
మెట్రో సిబ్బంది, స్టేషన్ స్టాఫ్, తోటి ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
బోగీలో హ్యాండ్ రైల్ ను పట్టుకుని నిలబడాలి
చిన్నారులు, వికలాంగులు, సీనియర్ సిటిజెన్స్, మహిళలు సీట్లలో కూర్చునేందుకు సహకరించాలి
దిగాల్సిన స్టేషన్ రాగానే రైలు దిగి స్టేషన్ బయటకు వెళ్లిపోవాలి
స్టేషన్ లోకి వెళ్లే సమయంలో తనిఖీ సిబ్బందికి, భద్రతా సిబ్బందికి సహకరించాలి
నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలను గుర్తిస్తే… వెంటనే మెట్రో సిబ్బందికి తెలియజేయాలి
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వచ్చే అనౌన్స్ మెంట్లను జాగ్రత్తగా వినాలి
రైలు ప్లాట్ ఫామ్ పై నిలిచిన తర్వాతే బోగీలోకి ప్రవేశించాలి
ప్రయాణిస్తున్న సమయంలో టోకెన్లు, స్మార్ట్ కార్డులు చూపించాలని మెట్రో సిబ్బంది అడిగితే వారికి సహకరించాలి
టికెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయి
టికెట్ కౌంటర్, ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద మీ వంతు వచ్చే వరకు క్యూలైన్ లో నిలబడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here