చరణ్ – కొరటాల సినిమా అటకేక్కిందా

ప్రస్తుతం చరణ్ .. సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల శివతో చరణ్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ చరణ్ తన నెక్స్ట్ మూవీని బోయపాటి శ్రీనుతో చేయనున్నట్టుగా తాజాగా ఒక టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లోనే బోయపాటి బిజీగా ఉన్నాడనీ, వచ్చేనెలలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చని అంటున్నారు. దాంతో కొరటాల శివతో చరణ్ చేయాలనుకున్న ప్రాజెక్టు ఆగిపోయిందా? లేదంటే వాయిదా పడిందా? అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. అసలు ‘మిర్చి’ తరువాతనే చరణ్ తో కొరటాల ఓ సినిమా చేయవలసి వుంది. స్క్రిప్ట్ విషయంలో చరణ్ అసంతృప్తి కారణంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఏం జరిగి ఉంటుందనేదే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here