రేపు వస్తున్న సినిమాలని ఎవరైనా అసలు కేర్ చేస్తారా ?

ఈ సంవత్సరం నవంబర్ నెల బాక్సాఫీస్ దగ్గర చిన్నాపెద్ద సినిమాలతో పాటు పక్క ఇండస్ట్రీలో సినిమాలు కూడా ఎక్కువగానే  విడుదలకు సిద్ధమవుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో మూడు సినిమాలు, సినిమాల తర్వాత రెండవ వారంలో నాలుగు సినిమాలు వచ్చాయి. గడచిన వారమైతే ఒకేసారి ఏడెనిమిది సినిమాలు దాకా విడుదలైన సినిమాలలోని కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరించాయి.
ఈ నెల చివరివారంలో మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విడుదలవడానికి సిద్ధంగా ఉన్నాయి.వీటిలో కొన్ని మాత్రమే చెప్పుకోదగ్గ సినిమాలు మిగతావన్నీకూరలో కరివేపాకు వంటివి.నారా రోహిత్ రెజిన జంటగా నటించిన బాలకృష్ణుడు శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ చురుగ్గా సాగుతున్నాయి. శ్రీ విష్ణు హీరోగా రాజ్ కందకురి నిర్మిస్తున్న మెంటల్ మదిలో కూడా విడుదలకు నోచుకొనుంది.
వీటితోపాటు ఆనంద్ రవి హీరోగా తెరకెక్కిన చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా సాయి పల్లవి దుల్కర్ సల్మాన్ల  మలయాళ  డబ్బింగ్   చిత్రం హే పిల్లగాడ, బేబీ,లచ్చి, జంధ్యాల రాసిన ప్రేమ కథ, జూన్ 1 4 3,జూలీ 2, వంటి సినిమాలు ఈ శుక్రవారం ధియేటర్ ముందుకు రాబోతున్నాయి. అసలు ఈ సినిమాలు  పేర్లు కూడా ప్రేక్షకులకు తెలియవు మరి నిర్మాతల నమ్మకం మీద సినిమాలను విడుదల చేస్తున్నారో వారికే తెలియాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here