ఆనందాన్ని ఎవరు కోరుకోరు ? .. ఈ యాడ్ లో పాప ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా

థియేట‌ర్లో సినిమా ప్రారంభానికి ముందు ‘ఆనందాన్ని ఎవ‌రు కోరుకోరు?’ అంటూ ప్ర‌క‌ట‌న వ‌స్తుంది. అందులో త‌న తండ్రితో క‌లిసి టీవీ చూస్తున్న‌ప్పుడు, తండ్రి ద‌గ్గుతుండ‌గా ప‌క్క‌నే ఉన్న కూతురు చూసే చూపులో చాలా అర్థం ఉంటుంది. ఆ ఒక్క చూపుతో సిగ‌రెట్ ఎందుకు తాగా‌నా? అని ఆ తండ్రి ప‌శ్చాత్తాపప‌డ‌టం ఆ ప్ర‌క‌ట‌న‌లో క‌నిపిస్తుంది.
అంత చిన్న‌వ‌య‌సులో త‌న మొద‌టి ప్ర‌క‌ట‌న‌లోనే న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఆ పాప పేరు సిమ్ర‌న్ న‌టేక‌ర్‌. ఇప్పుడు సీరియ‌ళ్లు, సినిమాలు, ప్ర‌క‌ట‌న‌ల‌తో చాలా బిజీగా ఉంది. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియ‌ల్‌లో పూజ పాత్ర పోషించింది ఆ పాపే. ఆ సీరియ‌ల్ మాత్ర‌మే కాదు పెహ్రేదార్ పియా కీ, ల‌వ్ జింద‌గీ, హాథిమ్ వంటి చాలా సీరియ‌ళ్ల‌లో, 150కి పైగా ప్ర‌క‌ట‌న‌ల్లో సిమ్ర‌న్ క‌నిపించింది. ధావ‌త్‌-ఎ-ఇష్క్‌, క్రిష్ 3, ఖైదీ బ్యాండ్ వంటి సినిమాల్లో కూడా నటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here