పూనమ్ కౌర్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో సంచలన పోస్ట్

గతంలో పవన్ కల్యాణ్ అభిమానులకు ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మధ్య జరిగిన గొడవల్లో హీరోయిన్ పూనమ్ కౌర్ పేరు బాగా వినబడేది. ఈ క్రమంలో ఒకానొక సమయంలో ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పూనమ్ కౌర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ కలిసి అర్ధరాత్రి ఒక ప్రముఖ దేవాలయంలో క్షుద్ర పూజలు చేశారు అని ఆరోపించారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ వివాదాలలోకి నన్ను లాగి నా కుటుంబాన్ని అన్యాయం చేయవద్దంటూ

ట్వీట్ చేసింది. అయితే చివరకు ఆ వివాదం ఆ తరువాత సర్దుమణిగింది. అయితే తాజాగా పూనమ్ కౌర్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో సంచలన పోస్ట్ చేసింది. ఈ పోస్టు మొత్తం సారాంశం పూనమ్ కౌర్ ఓ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి చేసినట్టుంది. ఈ క్రమంలో పూనమ్ కౌర్ చేసిన పోస్టుపై నెటిజన్లు అందరూ దీర్ఘ ఆలోచనలో మునిగిపోయారు. అంతలా ఆలోచింపజేసిన ఆ పోస్ట్‌లోని సందేశం ఏంటంటే ‘కాన్సెప్ట్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి, బట్టలు మార్చుకున్నట్లు మనుషులను మారుస్తూ, మాట మీద ఉండకపోవడం జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ, వేష భాషలు మారుస్తూ జనాలను మభ్యపెట్టి, అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ భగవంతుడే నిజం ఏంటో తెలిసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here