రంగస్థలం వివాదంపై స్పందించిన దర్శకుడు సుకుమార్

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మొట్టమొదటిసారిగా నటిస్తున్న సినిమా ‘రంగస్థలం’. ఈ క్రమంలో సినిమా విడుదలవుతున్న సమయంలో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ సినిమా పాటలు విడుదల చేశారు చిత్ర యూనిట్. సినిమాలోని ‘రంగమ్మ మంగమ్మ’ అనే పాటలో ‘గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే’ అనే చరణం ఉంది. దీనిపై యాదవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గొల్లభామ అనే పదాన్ని తొలగించాలని… లేకపోతే సినిమాను విడుదల అవకుండా ఆపేస్తామని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ హెచ్చరించారు. 

దీనిపై దర్శకుడు సుకుమార్ స్పందించాడు. గొల్లభామ అనే పదాన్ని మనుషులను, కులాలను ఉద్దేశించి వాడలేదని చెప్పాడు. గొల్లభామ అనేది ఒక పురుగని, దాని గురించి అందరికీ తెలిసే ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ జరుగుతుంది. వేసవి కానుకగా ఈ సినిమాను మార్చి 30వ తారీఖున విడుదల చేయాలనుకుంటున్నారు సినిమా యూనిట్. సుకుమార్ రామ్ చరన్ కలయికలో వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here