తెలుగుదేశం పార్టీకి జై కొట్టిన వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు

ఎన్డీఏ ప్రభుత్వం పై ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెడతాం అని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పెట్టే అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎంపీ ఒకరు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ తోట నరసింహం లోక్ సభ స్పీకర్ కు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈ రోజు శుక్రవారం స్పీకర్ సుమిత్రా మహాజన్ మొదట వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు.
ఆ తర్వాత టీడీపీ ఎంపీ తోట నరసింహం ఇచ్చారు అని ప్రకటించారు. ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ పెట్టదలచిన అవిశ్వాస తీర్మానానికి వైసీపీ పార్టీ తరఫున మద్దతు ఇస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రం బాగు పడుతుంది అని అంటే ఎవరికైనా మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here