పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ చంద్రబాబు

గుంటూరు వేదికగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబు కి పెద్ద తలనొప్పిగా మారాయి.  ఈ సందర్భంగా ఇటీవల శాసనమండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. సినిమాలు రాజకీయాలు ఒకటి కాదని అన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….రాజధాని, పోలవరం నిర్మాణంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. 

‘పవన్ కళ్యాణ్ రాజధానికి 1500 ఎకరాలు చాలు అంటున్నాడు. అది సరిపోదు. అమరావతికి 33 వేల ఎకరాలు ఎందుకిచ్చారని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ మీ బాధ ఏంటి. మీకసలు అవగాహన ఉందా. కాంట్రాక్టర్‌ను మార్చుకోవడం కోసం పోలవరం తీసుకున్నారని అంటున్నాడు. కాంట్రాక్టర్ పాత ధరకే కడతానన్నాడు. కేంద్రమే కాంట్రాక్టర్‌ని నిర్ణయిస్తుంది. లేనిపోని అనుమానాలు సృష్టించి అడ్డంకులు సృష్టిస్తే ఊరుకోనని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాకుండా మీ వెనక ఎవరూ ఉన్నారో నాకు తెలిసి అని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో పెను దుమారాన్ని రేపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here