స్టార్ హీరో సూర్య నుంచి ఖరీదైన బహుమతి అందుకున్న డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతారతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న డైరెక్టర్ విఘ్నేష్ శివ‌న్. ఇటీవల అమెరికా దేశం వెళ్లిన ఈ జంట అక్కడ చేసిన హడావిడిని సోషల్ మీడియాతో పంచుకున్నాడు విఘ్నేష్ శివ‌న్. ఇదిలావుండగా తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య నుంచి విఘ్నేష్ శివ‌న్ ఖరీదైన బహుమతి అందుకొని తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు.
ఇటీవల సూర్య హీరోగా విఘ్నేష్ శివ‌న్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన సినిమా `తానా సేంద్ర కూట్ట‌మ్‌` ఈ సినిమాకి ఓ మాదిరిగా ప్రేక్షకుల ఆదరణ లభించింది. తెలుగులో ఇదే చిత్రం గ్యాంగ్ పేరుతో రిలీజైన సంగ‌తి తెలిసిందే. సినిమాలో విష‌యం ఉన్నా లేక‌పోయినా ప‌రిమిత బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి, సేఫ్ అయ్యింద‌న్న స‌మాచారం ఉంది. అదంతా అటుంచితే త‌న ద‌ర్శ‌కుడికి హీరో సూర్య అరుదైన కానుకిచ్చాడు. అది కూడా ఖ‌రీదైన ట‌యోటో కార్‌ని కొనివ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here