నిర్మాణ రంగంలో తెలివిగా వ్యవహరిస్తున్నా నాని

ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో వరుస విజయాల మీద ఉన్న హీరో నాచురల్ స్టార్ నాని. ఈ క్రమంలో నాని ప్రతీ సినిమా గమనిస్తే అతని మార్కెట్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం నాని ప్రతీ సినిమా 40 కోట్ల మేర కలెక్షన్లు సాధిస్తుంది. దీంతో ఇండస్ట్రీలో నానితో సినిమాలు చెయ్యాలని ఉన్నా నిర్మాతలు కూడా నాని మార్కెట్ కు తగ్గట్టుగా దర్శకులను సెట్ చేసుకొని సినిమాలను నిర్మించాలని డిసైడ్ అయ్యారట.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. భరత్ అనే నేను సినిమా రిలీజ్ తరువాత హడావుడి మొత్తం అయిపోగానే కొరటాల నానితో సినిమా స్టార్ట్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. నాని కూడా కొరటాల తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కొరటాల సన్నిహితులు ఆ సినిమాను నిర్మించనున్నారని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలో నాని టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా ని హీరో నాని నిర్మిస్తున్నాడని అంటున్నారు నాని సన్నిహితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here