రవితేజ పక్కన హీరోయిన్ గా కేథరిన్

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’  అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మాస్ ఎంటర్టైన్మెంట్ తరహాలో తెరకెక్కిస్తున్నాడు ‘నేల టికెట్’ సినిమా డైరెక్టర్. అయితే ఈ సినిమా అయిన వెంటనే రవితేజ శ్రీనువైట్ల దర్శకత్వంలో  ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేయనున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా మొదలవకముందే మరొక సినిమా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు రవితేజ.
ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ కేథరిన్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు రవితేజ. ప్రస్తుతం చేస్తున్న ‘నేల టికెట్’ సినిమా సమ్మర్ కానుకగా విడుదల చేయాలనుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here