చంద్రబాబు పవన్ కల్యాణ్ మాటలు నమ్మకండి జాగ్రత్తగా ఉండండి: హీరో శివాజీ

సినీ హీరో శివాజీ  చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అని ఆరోపించారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ముందునుంచి చిత్తశుద్ధితో అడుగుతున్నా వైయస్ జగన్ అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాటలనే నమ్మాలి ప్రజలు అని  చెప్పారు శివాజీ. ఈ నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేశారు.

ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక‌రిపై మ‌రొక‌రు వ్య‌క్తిగ‌త దాడుల‌కు దిగుతున్నారు. కావాలంటే ప్ర‌త్యేక హోదా సాధించుకున్నాక మ‌నం, మ‌నం కొట్టుకుందాం.. తిట్టుకుందాం అంటూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై మండిపడ్డారు. అంతేకాకుండా వారి స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వారిని విడ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. వారిని తెలుగు ప్ర‌జ‌లు మెడ‌ప‌ట్టి గెంటేయాల‌ని కోరారు హీరో శివాజీ. ఆ విష‌యం ప‌క్క‌న పెడితే, ఇప్పుడు మ‌నంద‌రి ల‌క్ష్యం ప్ర‌త్యేక హోదా, దాని కోస‌మే పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు శివాజీ. దయచేసి ప్రత్యేక హోదా విషయంలో ప్రజలందరూ ఒకే తాటిపై ఉండాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి చెందుతుందని స్పష్టంగా చెప్పారు శివాజీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here