జాతీయస్థాయిలో రాజకీయ పార్టీలను కదిలించిన జగన్

పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పోరాటానికి దేశంలో పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. వాస్తవంగా ముందు నుండి గమనిస్తే ప్రత్యేక హోదా కావాలని హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెబుతున్న ఏకైక రాజకీయ నాయకులు ప్రతిపక్ష నేత జగన్.  ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రంలో పలు పరిశ్రమలు రావడం వల్ల యువతకు ఉపాధి అవకాశం దొరుకుతుందని అన్నారు.

అయితే ఈ క్రమంలో ఒకానొక దశలో అధికార పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపెట్టి ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రజలను పెడుతున్న సమయంలో కూడా జగన్ పోరాటానికి సిద్ధపడ్డారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పలుమార్లు ధర్నాలు దీక్షలు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా అనే ఒక లక్ష్యం కోసం ప్రజలను అనునిత్యం చైతన్యపరచడమే కాక జాతీయస్థాయిలో రాజకీయ పక్షాలను ఏకం చేసి కేంద్రంలో కూడా కదలిక రావడానికి వైఎస్ జగన్‌ కృషి చేశారు.

జగన్‌కు నాకు పోలికా.. జగన్‌తో నన్ను పోలుస్తారా అని మీడియాను ఈసడించిన ముఖ్యమంత్రే చివరకు ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ను అనుసరించాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక హోదా విషయంలో మొండితనంతో వ్యవహరించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని జాతీయ స్థాయిలో చర్చలు జరగడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here