నాగార్జున నాని మల్టీస్టారర్ సినిమాలో హీరోయిన్ రష్మిక మండన

ఇటీవల నాగశౌర్య హీరోగా వచ్చిన చలో సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మండన…ఈ సినిమాతో మంచి హిట్ కొట్టింది. గతంలో కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలుగొందిన రష్మిక మండన చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా విజయంతో మరో భారీ మల్టీస్టారర్ సినిమాలో హీరోయిన్ గా  రష్మిక మండన ఎంపికయ్యింది.
తాజాగా నాగార్జున – నాని ల కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టి స్టారర్ లో ఓ హీరోయిన్ గా ఎంపిక అయిందట. నాని సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందంటే ఈ అమ్మడు లాక్కు తొక్కినట్టే. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అమల పాల్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. శమంతక మని ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉగాది నుండి మొదలు కానుంది. ఈ సినిమాలో నాగార్జున డాన్ పాత్రలో కనిపిస్తుంటే నాని డాక్టర్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here