ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ముహూర్తం కేసీఆర్ చంద్రబాబు సమక్షంలో

ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత అన్న అనిపించుకున్న నాయకుడు ఢిల్లీ పెద్దల మెడలు వంచిన ఏకైక తొలి తెలుగు రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు. ఈ నేపథ్యంలో ఎన్టీ రామారావు జీవిత చరిత్రను ఎన్టీఆర్ బయోపిక్ గా తన కుమారుడు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ నెల 29న హైద్రాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది.

ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ , తమిళ భాషల్లో విడుదల చేస్తారట. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అతిధులు గా పాల్గొంటారట. ఇటీవలే బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ఇన్విటేషన్ అందించారని, ఈ సినిమా ప్రారంభోత్సవానికి అయన వస్తానని చెప్పాడట. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పకుండ వస్తాడు. ఇద్దరు చంద్రుల రాకతో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ముస్తాబవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కెసిఆర్ క్లాప్ తో .. చంద్రబాబు కెమెరా స్విచ్చాన్ తో ముహూర్తపు షాట్ ని తీస్తా రట. రాబోయే ఎన్నికల కంటే ముందే ఈ సినిమాని విడుదల చేయాలని బాలకృష్ణ భావిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here