వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ సినిమా

అక్కినేని అఖిల్ హలో సినిమా తర్వాత చేయబోయే సినిమా విషయంలో చాలా డైరెక్టర్ ల పేర్లు వినపడ్డాయి. అయితే ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా స్వయంగా అఖిల్ తన తర్వాత చేయబోయే సినిమా విశేషాలు ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశాడు. ఈ నేపథ్యంలో తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా చెప్పాడు….”ఆదివారాలు చాలా లవ్లీగా ఉంటాయి కదూ! ఈ లవ్లీ ఆదివారం నా కొత్త సినిమా ప్రాజెక్టు వివరాలను వెల్లడించాలనుకుంటున్నాను.

వెంకీ అట్లూరి నా కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తారు. మేలో చిత్రీకరణ మొదలవుతుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత” అని అఖిల్ ట్వీట్ చేశాడు. ఇప్పటిదాకా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుండి సరైన హిట్ లేక బాధ పడుతున్నా అఖిల్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్టు కొట్టాలని అన్నుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here