ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని అధికార ప్రతిపక్ష పార్టీలను కడిగిపారేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఇటీవల పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా ప్రత్యేక హోదా కాదు నిధులే ముఖ్యమని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్ తీసుకోవడంతో రాష్ట్ర రాజకీయాలను సమీకరణాలు ఒకేసారి మారిపోయాయి. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక హోదా కి బదులు ప్రత్యేక సాయం చేయాలని మోడీని అడగటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో కుమ్మక్కయ్యారు కానీ అంటున్నారు అధికార పార్టీ తెలుగుదేశం నాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here