చంద్రబాబు ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అవినీతిపై దేశ ప్రధానమంత్రి మోదీ కి ఫిర్యాదు చేస్తానని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ప్రముఖ నేషనల్ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగు దేశం నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు అని అన్నారు.
ముఖ్యంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ అవినీతికి అంతే లేదు అని అన్నారు. అన్యాయంగా విభజనకు గురైన ఓ రాష్ట్రాన్ని ఎలా ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి కలిసి దోచుకోవడం ప్రజలను వంచించడమే అని అన్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తెలుగుదేశం నాయకుల పై ముఖ్యమంత్రి చంద్రబాబు పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా  ఇటివల ఒక మంత్రి ఏకంగా పర్సంటేజీల గురించి బహిరంగంగానే వ్యాఖ్యానించారని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉంటే భావితరాల జీవితాలు నాశనం అయిపోయాతయి అని అన్నారు పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here